భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడమే మోదీ లక్ష్యం
వెంకటాపూర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని సేవా మేరా యోగదాన్ రాష్ట్ర కో-కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్లాల్(State Executive Committee Member Bhukya Jawaharlal) అన్నారు. మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'సేవా సంకల్ప అభియాన్' లో భాగంగా ఆదివారం మండలంలోని నల్లగుంట గ్రామంలోని 109, 110 బూత్ల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూక్య జవహర్ లాల్ మాట్లాడుతూ.. మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవను పురస్కరించుకుని నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొక్కలు నాటడంతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రవి, కృష్ణమూర్తి, వార్డు సభ్యులు శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు సమ్మయ్య, అశోక్, కావ్య, క్రాంతి, రూప్సింగ్, రాజు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.