29 August, 2026 | 7:11 PM

జిల్లా కార్యదర్శిగా మోహన్ దాస్

29-08-2026 06:40 PM

ఖానాపూర్ (విజయ క్రాంతి): బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కార్యదర్శిగా సగ్గం మోహన్ దాస్ ను నియమించినట్లు జేఏసీ జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న ముదిరాజ్, రాష్ట్ర సభ్యులు రామగిరి రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లాలోని 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీలను డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో హక్కులు రాజ్యాధికారం కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మోహన్ దాస్ జిల్లా పద్మశాలి సంఘం  అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. జిల్లా కార్యదర్శి ఎన్నికైన ఈయనకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.