సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో తిరుగుబాటు
సీఎం అమెరికా పర్యటన రద్దు వెనక రాజకీయ కారణాలు
సీఎం సీటు పోతుందనే భయంతోనే రద్దు
కేంద్రంపై నెపం నెట్టడం సరికాదు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అమెరికా టూర్ రద్దుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ(Congress vs BJP) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆగస్టు సంక్షోభం భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్(Revanth Reddy's America tour) రద్దు చేసుకున్నారని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు( Raghunandan Rao) ఆరోపించారు. రేపూ మాపో సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో తిరుగుబాటు జరుగబోతుందని తమకు సమాచారం ఉందని తెలిపారు.
ఆ భయంతోనే రేవంత్ అమెరికా పర్యటన రద్దు(Revanth's US tour cancelled) చేసుకున్నారని స్పష్టం చేశారు. లండన్ పర్యటనకు అనుమతించిన కేంద్రప్రభుత్వం అమెరికా పర్యటనకు ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. పేద పిల్లల చదువుల కోసమే సీఎం రేవంత్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. పిల్లల చదువు కోకూడదని బీజేపీ, బీఆర్ఎస్ కుట్రపన్నాయని ఆరోపించింది. అక్కసుతోనే సీఎం రేవంత్ టూర్ కు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది.






