గోదావరి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

24-09-2026 | 02:48pm

ఖానాపూర్( విజయక్రాంతి ): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో(Khanapur Municipality) గోదావరి వద్ద వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంక మౌనిక మహేందర్ గురువారం పరిశీలించారు. నిమజ్జనం కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా విద్యుత్తు ,రహదారి మరమ్మతులు, ఇతర ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. కౌన్సిలర్ గుమ్ముల అశోక్ ,మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ,సానిటరీ ఇన్స్పెక్టర్ పోశెట్టి ,జవాన్ మానాల శంకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు