వేతనాల కోసం మున్సిపల్ కార్మికుల నిరసన

10-09-2026 | 11:24am

హుజురాబాద్,సెప్టెంబర్10: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar Districtహుజురాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు వేతనాలు విడుదల చేయాలని మున్సిపల్ కార్మికులు(Municipal workers protest) గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎండి అజ్జు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయలేదని కార్మికులకు వేతనాలు విడుదల కాకపోవడంతో పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని వెంటనే కార్మికుల వేతనాలు విడుదల చేయాలని లేనియెడల ఉద్యమం తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడలు దాచేపల్లి సరోజన, ప్రధాన కార్యదర్శి గురగాల కుమార్, సులోచన,వినోద, కుమార్, కాంత్ కుమార్, తోపాటు కార్మికులు, వాటర్ సప్లై కార్మికులు, ఎలక్ట్రిషన్ కార్మికులు, హరితహారం కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు