మున్నూరు కాపు సంఘ భవనానికి కృషి

19-09-2026 | 06:23pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని  జిల్లా యూత్ అధ్యక్షుడు(District Youth President) గాజుల రాజేంద్రప్రసాద్ తెలిపారు.శనివారం ఆయనను సంఘం నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) మాట్లాడుతూ.. మున్నూరు కాపులందరూ ఆన్‌లైన్ యాప్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని, ఐక్యతతో ఉండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సంఘం కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్ సహకారంతో జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుంకరి పెంటయ్య, గాజుల సత్యనారాయణ, రుకుం ప్రహ్లాద్, అడప సతీష్, మనిగొండ సంతోష్, మేకర్తి లచ్చన్న, అడప అశోక్, మేకర్తి ప్రశాంత్, సైధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు