నాగశెట్టి పాటిల్‌కు ఓబీసీ మోర్చా మండల అధ్యక్ష బాధ్యతలు

18-09-2026 | 01:55pm

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఓబీసీ మోర్చా అధ్యక్షులు కోణం విఠల్ శుక్రవారం నాగల్‌గిద్ద మండల ఓబీసీ మోర్చా(OBC Morcha) నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా హన్మశెట్టి నాగశెట్టి పాటిల్, కార్యదర్శిగా కుషాల్‌రావు, బస్వరాజ్‌లను నియమించినట్లు తెలిపారు. నాగశెట్టి పాటిల్‌కు మండల బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్, బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ యాదవ్‌తో పాటు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు