‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్

09-09-2026 | 03:26pm

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉండగానే ఈ చిత్రం ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

నార్త్ అమెరికాలో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన లభించింది. అమెరికాలో ప్రీసేల్స్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే సినిమార్క్ ద్వారా 100K డాలర్లకు పైగా అడ్వాన్స్ సేల్స్ జరిగినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. నార్త్ అమెరికాలో ఇంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తెలుగు సినిమాగా ‘ది ప్యారడైజ్’ నిలిచినట్లు పేర్కొన్నారు. దీంతో నాని అభిమానుల్లో సినిమా విడుదలపై మరింత ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు