నారాయణపేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
చిట్టెం పర్ణికరెడ్డికి శుభాకాంక్షల వెల్లువ
నారాయణపేట, ఆగస్టు 20 (విజయక్రాంతి): నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికరెడ్డి జన్మదిన వేడుకలను నారాయణపేట పట్టణంతో పాటు వివిధ మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పాఠశాలల్లో కార్యక్రమాలు, విద్యార్థులు, పేదలకు సంక్షేమ సామగ్రి పంపిణీ చేపట్టారు.
నారాయణపేట పట్టణంలోని సాయి విజయ కాలనీలో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కల్లమ్మ దేవి ఆలయంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. నారాయణపేటలోని కేజీబీవీ పాఠశాలలో పార్టీ కార్యకర్తల పర్యవేక్షణలో జిల్లా ఆర్టీఏ సభ్యుడు పోశాల రాజేష్ బాలికలకు క్రీడా కిట్లను పంపిణీ చేశారు.
నారాయణపేటలోని అనాథాశ్రమంలో చిన్నారులకు పెన్నులు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, ప్రథమ చికిత్స కిట్లను పంపిణీ చేశారు. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఫ్యాన్లను పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటారు. పార్టీ నాయకుడు శివకుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీవీఆర్ భవన్లో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ధన్వాడ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ప్రింటర్లను పంపిణీ చేసి మొక్కలు నాటారు.
ధన్వాడ మండలం గున్ముక్ల గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎమినోనిపల్లి గ్రామంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మరికల్ మండలంలోని కేజీబీవీ పాఠశాలకు బుక్ ర్యాక్లను అందజేసి, అనంతరం జీపీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో 20 ఫ్యాన్లను పంపిణీ చేసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులతో కలిసి శివకుమార్ రెడ్డి భోజనం చేశారు. కోయిలకొండ మండలంలోని క్రాస్రోడ్డు వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటారు.






