జనగణన కులగణనలో బీసీ కాలాన్ని పెట్టాలి

24-10-2026 | 04:25pm

బెల్లంపల్లి: తెలంగాణ కాంగ్రెస్ (ప్రభుత్వం) ఇచ్చిన మూడు డిక్లరేషన్లను అమలు చెయ్యాలనీ,కుల గణనలో బీసీ  కాలాన్ని పెట్టాలని బీ ఎల్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సంక రవి డిమాండ్ చేశారు. బెల్లంపల్లి mcpiu పార్టీ కార్యాలయంలో బహుజన లెఫ్ట్ ప్రంట్ (Bahujan Left Front) సమావేశం పసులేటి వెంకటేష్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్బంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సంకె రవి, సబ్బని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. నవంబర్ 1న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కులగణనలో  బీసీ కాలాన్ని పెట్టకుండా బీసీ ల జనాభా,ఆర్థిక, సామాజిక, రాజకీయ  లెక్కలు తియ్యడం లేదనీ విమర్శించారు.

దీనివలన బీసీలు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నదనీ వాపోయారు. అదేవిదంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు, BC, SC, ST, డిక్లరేషన్ల హామీతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు.  మూడు డిక్లరేషన్లను అమలు చేస్తామనీ హామీ ఇచ్చిందని తెలిపారు.

అధికారంలోకి వచ్చి మూడేండ్లు  దాటిపోతున్న ఇచ్చిన డిక్లరేషనలను అమలు చెయ్యడం లేదని విమర్శించారు.  బీసీ కాలాన్ని చేర్చాలని,మూడు డిక్లరేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తిసుకురావడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో నాయకులు కన్నురి సమ్మయ్య,తోగరి రాహులు, జెంజర్ల శేఖర్, శంభోజీరాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు