బీఆర్ఎస్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అస్తవ్యస్తం
BRS సభ్యుల ప్రవర్తన తీవ్ర ఆవేదన
హైదరాబాద్: ప్రస్తుత సమావేశాల కోసం తెలంగాణ అసెంబ్లీ నుండి 20 మందికి పైగా BRS ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్(Congress MLA Naveen Yadav) స్పందించారు. కొత్త ఎమ్మెల్యేలుగా, అసెంబ్లీ కార్యకలాపాలను నేర్చుకునేందుకు, ప్రజల సమస్యలను వినిపించేందుకు ఒక అవకాశంగా తాము భావిస్తామని పేర్కొన్నారు. అయితే, BRS సభ్యుల ప్రవర్తన తీవ్ర ఆవేదన కలిగిస్తోందని వెల్లడించారు.
బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) సభ్యులు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ పట్ల, స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad Kumar ) పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. స్పీకర్ పట్ల BRS ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర బాధాకరమైనవి, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రవర్తనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిని సమావేశాల నుండి సస్పెండ్ చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి నవీన్ యాదవ్ కోరారు.