పేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి కల్పించాలి
మద్దిశెట్టి సామేలు
సత్తుపల్లి. అక్టోబర్ 3. ( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు(Journalists) ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిలా పనిచేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని, అయితే అనేకమంది పేద జర్నలిస్టులు సరైన ఇళ్ల స్థలాలు(House sites) లేక ఆర్థిక ఇబ్బందులతో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారని NCP పార్టీ – NDA మహాకూటమి(NDA Grand Alliance) – NYC జాతీయ కార్యవర్గ సభ్యులు(National Executive Committee Members), తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. మద్దిశెట్టి సామేలు.అన్నారు.
ఈ నేపథ్యంలో అర్హులైన, పేద జర్నలిస్టులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ వసతి కల్పించడంతో పాటు, సాధ్యమైన చోట ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని కేంద్ర మరియు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్ట్ యూనియన్లతో(Journalist unions) సమన్వయం చేసుకుని నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను గుర్తించాలని కోరారు. సొంత మోటార్‌సైకిల్ లేకపోవడం, కనీసం పెట్రోల్ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అర్హులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ మేరకు కేంద్రానికి మరియు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి వినతిపత్రం సమర్పించనున్నట్లు మద్దిశెట్టి తెలిపారు. అర్హులైన పేద జర్నలిస్టులకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.