బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నెల్లి నరసింహ

05-10-2026 | 07:47pm

రాజాపూర్ అక్టోబర్ 5: రాజాపూర్ మండల బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నెల్లినరసింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిజెపి అధ్యక్షుడు ఆనంద్(Mandal President Anand) తెలిపారు. సోమవారం ఆనంద్ అధ్యక్షతన అధ్యక్షతన రాజాపూర్ మండల బిజెపి పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి సీనియర్ నాయకుల సూచన మేరకు మండల్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నెల్లి నరసింహను ఎన్నుకున్నట్లు తెలిపారు.

అనంతరం పాలమూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండలంలోని గ్రామాలలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నరసింహులు, నాయకులు శేఖర్, లక్ష్మీనారాయణ, కార్యదర్శులు గంగాధర్ గౌడ్, మధు,శేఖర్ గౌడ్ తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు