కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తూ సంఘీభావం
నేరేడుచర్ల,అక్టోబర్ 03(విజయ క్రాంతి): నేరేడుచర్ల పట్టణంలోని(Nereducherla town) ప్రధాన కూడలిలో మాతరం యూత్(Mataram Youth) ఆధ్వర్యంలో భారత వీరుడు కెప్టెన్ స్మిత్ మచ్చర్(Indian hero Captain Smith Matcher) త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...భారతమాత ముద్దుబిడ్డ కెప్టెన్ స్మిత్ మచ్చర్(Smith Matcher) 174 మంది ప్రాణాలను కాపాడేందుకు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయమన్నారు. శరీరంలో తీవ్ర గాయాలతో రక్తం కారుతున్నా ధైర్యాన్ని కోల్పోకుండా ఆయన చూపిన తెగువ దేశానికి గర్వకారణమన్నారు.
ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రతి భారతీయుడు ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలకు ప్రతి భారతీయుడు సెల్యూట్ చేయాలని కొనియాడారు. కార్యక్రమంలో నేరేడుచర్ల స్కూల్ విద్యార్థులు, యువత, సామాజిక సేవకులు, ప్రముఖులు ఫైలెట్స్ స్మిత్ ధైర్యసాహసాలను కొనియాడుతూ గ్రేట్ ఇండియా-గేట్ ఫైలెట్, గెట్ వెల్ సూన్-ఫైలెట్ స్మిత్ నినాదాలు చేయడం జరిగింది.వెంకట రమణ శాస్త్రి, సుధాకర్ పాస్టర్, అమీర్ అలీ వారిచే సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు జింకల భాస్కర్, సరికొప్పుల నాగేశ్వర్ రావు, యారవ సురేష్, దేవిరెడ్డ్ నాగిరెడ్డి లతో పాటు టీచర్లు ఎంఈఓ బాలు నాయక్, మధార్ , బట్టు మధు, షేక్ యూసఫ్, , హెడ్ మాస్టర్ శ్రీనివాస రావు, లింగయ్య, రాపోలు నవీన్ కొణతం నాగిరెడ్డి హిందూజ, గుగులోతు రవీందర్ నాయక్, ఇంజమూరి శ్రీను వాస కరుణాకర్, రమణ, కాలం నాగయ్య, కాలం శైలజ, విమల , కొప్పు లక్ష్మీనారాయణ, మెట్టు మధు తదితరులు పాల్గొన్నారు