శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
ముదిగొండ విజయ క్రాంతి అక్టోబర్ 3 : మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన(Sri Lakshmi Narasimha Swamy Temple) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఈవో సమత(Endowment Department EO Samatha) ఆధ్వర్యంలో దేవస్థాన చైర్మన్‌గా కొమ్ము నరసింహారావుతో పాటు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం పాల్గొని నూతన పాలకవర్గానికి ఆశీస్సులు అందజేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సూడ చైర్మన్ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మండల నాయకులు, గ్రామ నాయకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు.
నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావాలని పలువురు ఆకాంక్షించారు.