గౌడ సంఘంలో నూతన సభ్యత్వాల కోసం దరఖాస్తులు
03-10-2026 | 11:48pm
గణపురం,సెప్టెంబర్ 03 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని గీత పారిశ్రామిక సంఘం(Geetha Industrial Association) కార్యాలయంలో నూతన సభ్యత్వాల కోసం పలువురు గౌడ సంఘం నాయకులకు దరఖాస్తులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు మర్క మొగిలి గౌడ్, కారోబార్ గుర్రం సదానందంకు గణపురం ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ సభ్యత్వ వినతులు అందించారు.ఈ కార్యక్రమంలో గుర్రం తిరుపతి గౌడ్, మోటపోతుల రాజన్న గౌడ్, దిండు రమేష్ గౌడ్, పల్లె రాజు గౌడ్, నాయకపు ప్రసాద్ గౌడ్, మర్క శ్రీను గౌడ్, మర్క శివకుమార్ గౌడ్, దుర్గం రోహిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.