ఆర్ఎంపీ వైద్యుల నిరసన

03-10-2026 | 05:50pm

నిర్మల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఆర్‌ఎంపీ, పీఎంపీల సమస్యల పరిష్కార కోరుతూ జిల్లాలో ఆర్ఎంపీలు నిరసన(Nirmal RMPs Protest) తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే శిక్షణనిచ్చి, అధికారికంగా గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. 2009లో జారీ చేసిన జీవో (G.O. No. 1273/429) ప్రకారం శిక్షణ ఇచ్చి గుర్తింపు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నిలదీశారు.

అధ్యక్షులు శివశరణ్, కార్యదర్శి ధనంజయ్, ఉపాధ్యక్షులు వెంక గారి భూమయ్య, కన్న సాయన్న, రవి, సంయుక్త కార్యదర్శి లు ప్రభాకర్, భీమేష్, సాయినాథ్, సురేందర్ రెడ్డి, సభ్యులు మురళి, సబ్జల్ అలీ, రమణారెడ్డి. అశోక్, మోహన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు,

మరిన్ని వార్తలు