19 August, 2026 | 2:56 AM

రెడ్ బ్యాగ్ ట్విస్ట్‌ను ఎవరూ ఊహించలేరు!

19-08-2026 12:00 AM

కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. దర్శకుడు రవికుమార్ సీరపు ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది.

ఈ క్రమంలో నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. “మా రెడ్ బ్యాగ్ చిత్రానికి మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్కి మంచి ఆదరణ దక్కింది. మా సినిమా చాలా స్టైలీష్‌గా ఉందని, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అంతా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ట్విస్ట్‌ను ఎవ్వరూ ఊహించలేరు. చివరి వరకు ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం.