బియ్యం సరఫరా చేయాలని మిల్లర్లకు ఆదేశాలు

24-10-2026 | 06:35pm

పౌరసరపరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

కామారెడ్డి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రైస్ మిల్లర్లు(Rice Millers) త్వరితగతిన బియ్యం సరఫరా(Rice supply) చేయాలని రైస్ మిల్లర్లకు  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్(Shyam Prasad Lal) ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) కలెక్టర్ ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ అధ్యక్షతన శనివారం బియ్యం సరఫరాపై రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

 పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్  మాట్లాడుతూ, రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం నిల్వలు, సరఫరా ప్రక్రియను సమీక్షించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు.

బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్, పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు భూమేష్ గుప్తా, జిల్లాలోని రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు