కాకతీయుల కళ.. కోటగుళ్లు భళా!
అబ్బురపడిన గ్రూప్- 1, గ్రూప్ -2 అధికారులు
భూపాలపల్లి/గణపురం, అక్టోబర్ 3 (విజయ క్రాంతి): కాకతీయుల(Kakatiya architecture) చరిత్రకు సాక్ష్యంగా కోటగుళ్లు దేవాలయ సముదాయాలు నిలుస్తాయని గ్రూప్ - గ్రూప్- ట్రెయినీ అధికారులు పేర్కొన్నారు. గణపురం మండల కేంద్రంలో కాకతీయుత కళావైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీభవానీ సహిత గణపేశ్వరాలయం (కోటగుళ్లు)ను శిక్షణ పొందుతున్న 180 మంది గ్రూప్-1, గ్రూప్-2 అధికారులు సందర్శించారు.
కాకతీయుల అద్భుతమైన శిల్పకళ, ఆలయ నిర్మాణశైలి, రాతి శిల్పాల సౌందర్యాన్ని చూసి అబ్బురపడ్డారు. ఇంతటి అపురూపమైన చారిత్రక సంపదను చూసే అవకాశం కలగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శిల్పసంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆలయ విశిష్టతను సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి యాదగిరిగౌడ్ అధికారులకు వివరించారు. అధికారుల వెంట పర్యాటక శాఖకు చెందిన సూర్యకిరణ్ , తాళ్లపల్లి యుగంధర్ గౌడ్, పునావస్తు శాఖ సెక్యూరిటీ నల్లగొండ రాజుగౌడ్ ఉన్నారు.