మరింత ఆలస్యంగా ‘ఓమ్’
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Kollywood star hero Dhanush), మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి(Mollywood star Mammootty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజాచిత్రం ‘ఓమ్(Ohm)’. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహిస్తుననారు. ఎచ్రందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో సాయిపల్లవి(Sai Pallavi), శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం దర్శకుడు. అక్టోబర్ 16న విడుద కావాల్సి ఈ సినిమా మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాము ప్రకటించిన తారీఖునే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్-2’ విడుదల కానున్న నేపథ్యంలో ‘ఓమ్’ మేకర్స్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా కొత్త డేట్ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. “అత్యంత శక్తిమంతమైన దాడికి సమయం ఆసన్నమైంది.. ‘ఓమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది” అంటూ తాజా పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ పోస్టర్‌లో ధనుష్, మమ్ముట్టి సీరియస్ యాక్షన్ మూడ్‌లో చేతిలో గన్స్ పట్టుకుని కనిపించారు.