లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక..
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ (Raj Weds Rambai)ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘క్రేజీ కల్యాణం’(cregy kalyanam). ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి (Boosam Jagan Mohan Reddy)నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ మేకర్స్ శనివారం ఈ మూవీ నుంచి ‘కాకా ధూమ్ ధమాకా’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక.. అరే బాపు రచ్చ లేపు.. సుట్టాలంతా ఈడ గుమ్మిగూడాక.. మూడు ముళ్ల సంబరాల డోలు బాజాకొట్టు.. కొంగుముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు..’ అంటూ సాగుతోందీ గీతం. పెళ్లి భరాత్‌లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో సాగే ఈ పాటకు సురేశ్ బొబ్బిలి మాస్ ట్యూన్‌తో కంపోజ్ చేయడమే కాక ర్యాప్ వోకల్స్ ఆయనే అందించారు.
ఈ గీతానికి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, జంగి రెడ్డి పాడారు. ఈశ్వర్ పెంటి అదిరే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ హైలైట్‌గా ఉన్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: శ్యామ్ దూపాటి; సంగీతం: సురేశ్ బొబ్బిలి; లిరిక్స్: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్; యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్; ఎడిటర్: శ్రావణ్ కటికనేని; ప్రొడక్షన్ డిజైన్: శ్రీపాల్ మాచర్ల.