విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలుండాలి

22-09-2026 | 05:05am

సర్వతోముఖాభివృద్ధికి స్వామివారి ఆశీస్సులుండాలి

విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, డైరెక్టర్ సీ శ్రీకాంత్

మంథని పెంజెరువుకట్ట వినాయకుడి సన్నిధిలో పూజలు

మంథని, సెప్టెంబర్ 21 (విజయశాంతి): విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని విజయక్రాంతి దినపత్రిక(Vijayakranthi Daily Newspaper) చైర్మన్ సీఎల్ రాజం(CL Rajam), డైరెక్టర్ సీ శ్రీకాంత్(C Srikanth) ఆకాంక్షించారు. మంథని పట్టణంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు(Vinayaka Navaratri Celebrations) ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని చారిత్రక పెంజజెరువు కట్ట వద్ద కొలువుదీరిన లంబోదరుడిని సోమవారం సీఎల్  రాజం, శ్రీకాంత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితు ల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు జరిపించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో మం థని ప్రాంతం అన్ని రంగాల్లో మరింత వేగంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఉత్సవాలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న నిర్వాహకులనుప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు