ఘాటెక్కిన ఉల్లి.. కిలో రూ.80

18-09-2026 | 03:30pm

పది రోజుల్లో రెట్టింపైన ధర.. సామాన్యుల గగ్గోలు

వాంకిడి, (విజయక్రాంతి): ఉల్లి ధరలు (Onion prices)ఒక్కసారిగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.70 నుంచి రూ.80కు చేరింది. దీంతో నిత్యావసర సరుకుల (Essential commodities)ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అదనపు భారం పడుతోంది.

మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే సంతలో మహారాష్ట్ర నుంచి దిగుమతి అవుతున్న పాత ఉల్లి ధర కిలో రూ.80 పలుకుతుండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి వస్తున్న కొత్త ఉల్లి ధర కిలో రూ.70గా ఉంది.

ప్రధాన మార్కెట్లలోనే ధరలు పెరగడంతో తాము ఏమీ చేయలేమని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇలా పెరుగుతుంటే సామాన్యులు ఎలా కొనుగోలు చేసి జీవనం సాగించాలని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు