మా సినిమా అందరికీ ఓ థెరపీ
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాలో శివాజీ, వాసుకి, రోహన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు రష్మిక మందన్నా, టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ (Tollywood director Shiva Nirvana) ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. “ఆనంద్ ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు.
సినిమా కోసమే కష్టపడుతుంటాడు. కడలి పాత్ర గొప్పగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంతో వైష్ణవికి గొప్ప పేరు వస్తుంది. ఆదిత్యను చూస్తే గర్వంగా అనిపిస్తుంటుంది. 90’స్ మూవీ తర్వాత ఆయనపై బాధ్యత పెరిగిపోయింది. హేషమ్ మ్యూజిక్ ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “మనం బాధల్లో ఉంటే భాగస్వామి వచ్చి పట్టుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా ఎపిక్ మూమెంట్ అవుతుంది.
ఈ సినిమా అందరికీ ఓ థెరపీలా ఉంటుంది. ‘ఏమాయ చేశావే’, ‘ప్రేమలు’ కలిపితే వచ్చే ఓ అందమైన కథలా ‘ఎపిక్’ ఉంటుంది. సెప్టెంబర్ 11న మా సినిమా అందరినీ కదిలిస్తుంది” అని తెలిపారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “ఆనంద్‌లో ఎప్పుడూ ఒకేలా ఉండటం అనే ఆ లక్షణమే నాకు ఇష్టం. ‘ఎపిక్’ చిత్రం మంచి విజయం సాధిస్తుంది” అని చెప్పింది. చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “ఎపిక్’ ట్రైలర్ చూసి అందరికీ కల్చరల్ షాక్ కలిగే ఉంటుంది.
90స్ వరల్ నుంచి వస్తున్నా కూడా కొంత షాకింగ్‌గా ఉంటుంది. ఇది కేవలం అట్రాక్షన్ కోసం చేసింది కాదు. ఇందులో మంచి ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఆ విషయం సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది. ఈ మూవీలో అమాయకత్వం ఉంటుంది. ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో శివాజీ, డైరెక్టర్లు శివ నిర్వాణ, శైలేష్ కొలను, సాయి మార్తాండ్, కళ్యాణ్ శంకర్, వినోద్ అనంతోజు, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్, శ్రీనివాస్ గవిరెడ్డి కూడా మాట్లాడారు.






