అసభ్యత లేని క్లీన్ మూవీ మాది
ఖాన్ దురాని(Khan Durrani), సాహితి ఆవంచ(Sahithi Avancha) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు(Paila Prasad Rao), కిషోర్ గుండాల నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్(Theatrical release)కు సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్, పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు.
హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. “ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్‌తో మా సినిమా తెరకెక్కించాం” అన్నారు. ‘మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా ప్రేక్షకాదరణ పొందుతుంద’ని హీరోయిన్ సాహితీ అవంచ తెలిపింది. ‘యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిద’ని డైరెక్టర్ రవి లోకిరెడ్డి చెప్పారు.
‘మనందరిలో ఒకరికి జరిగే లాంటి కథే ఇద’ని నిర్మాత పైలా ప్రసాద్ రావు అన్నారు. నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. ‘ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’ అని తెలిపారు. ఈ వేడుకలో ప్రొడ్యూసర్ కూనిరెడ్డి శ్రీనివాస్, దర్శక నిర్మాత అయోధ్యకుమార్, ఈ చిత్రబృందం కూడా మాట్లాడారు.