లార్డ్స్ టెస్టులోనూ పాక్ చిత్తు
31-08-2026 12:00 AM
సిరీస్ ఇంగ్లాండ్ కైవసం
లార్డ్స్, ఆగస్టు 30: సొంతగడ్డపై ఇంగ్లాండ్(England) జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పాకిస్తాన్(Pakistan)తో జరిగిన రెండో టెస్టులోనూ ఘన విజయం సాధించింది. లార్డ్స్(Lords) వేదికగా రెండో ఇన్నింగ్స్‌లోనూ పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓ సెషన్‌లో మాత్రమే కాసేపు పోరాడింది.
షకీ ల్ (97) తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. దీంతో పాక్ రెండో ఇన్నిం గ్స్‌లో 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్ 4, టంగ్ 3, ఆర్చర్ 2 వికెట్లు తీశారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 290 పరుగులు చేయగా, పాక్ జట్టు కేవలం 110 రన్స్‌కే కుప్పకూలింది.






