భారత్ చేతిలో పాక్ చిత్తు

11-09-2026 | 05:10am

19-0 గోల్స్‌తో ఘన విజయం 

మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ

మోకీ, సెప్టెంబర్ 10: మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీ(Women's Junior Asia Cup tournament)లో భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ను ఏకంగా 19-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఈ టోర్నీ సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆట మొదలైన ఏడో నిమిషంలోనే పూజా సాహూ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే కూడా గోల్స్ సాధించారు. ఫలితంగా ఆట తొలి అర్ధ భాగంలోనే భారత్ 10-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.

ఇక రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు జోరు కొనసాగించింది. మాలిక్ హ్యాట్రిక్ గోల్స్‌తో దుమ్ములేపగా.. సుప్రియా రెండుసార్లు గోల్ కొట్టింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్, రోషిణి కూడా అద్భుత ఆట తీరు కనబరిచారు. ఆఖ రి నిమిషంలో రోషిణి మరోసారి గోల్ కొట్టడంతో భారత్ పాక్‌పై 19-0 గోల్స్ తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. సెమీ ఫైనల్‌లో భారత్... సౌత్ కొరియా- మలేషియా మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ 2023, 2024 ఎడిషన్లలో భారత జట్టు విజేతగా నిలిచింది.

మరిన్ని వార్తలు