కేసీఆర్ హయంలోనే ఆదివాసుల అభివృద్ధి
17-09-2026 | 05:03pm
భీంపూర్,(విజయక్రాంతి): కేసీఆర్ హయంలోనే ఆదివాసుల అభివృద్ధి(Development of tribals) జరిగిందని లంబాడీ తండాలు, ఆదివాసీ గూడలను ప్రత్యేక పంచాయతీలుగా చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకుడు మాడవి లింబాజి అన్నారు. గురువారం భీంపూర్ మండల కేంద్రంలో గిరిజనులకు రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి పెంచి మూడు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట ప్రభుత్వం ఆదివాసీల మనోభావాలకు,వారి సంస్కృతి,సాంప్రదాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.