19 August, 2026 | 2:50 AM

ఘనంగా పాపన్న జయంతి

19-08-2026 12:00 AM

చేగుంట, ఆగస్టు 18: చేగుంట పట్టణ కేం ద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బహుజన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు, సభ్యుల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వ హించారు. అనంతరం  సర్దార్ సర్వాయి పా పన్న చిత్రపటానికి పూలమాలలు వేసి,  ని వాళులర్పించారు.

అనంతరం కర్ణాల్‌పల్లి ఎల్లమ్మ గుడి వద్ద సమావేశమై పాపన్న చేసిన త్యాగాలను, చూపిన పో రాట పటిమను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులుగా విశేష సేవలంది స్తున్న వడియారం సర్పంచ్, పోలంపల్లి ఉపసర్పంచ్లను గౌడ సంఘం నాయకులు శాలు వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలరాజు గౌడ్, కిషన్ గౌడ్, సర్పంచ్ సాయికుమార్ గౌడ్, యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు.