18 August, 2026 | 6:09 PM

తెలంగాణ పోరాట యోధుడు సబ్బండ జాతులకు పాపన్న గౌడ్ ఆదర్శం

18-08-2026 05:19 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తొలి తెలంగాణ పోరాట యోధుడు..సబ్బండ అనగారిన వర్గాలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శప్రాయుడని నాగిరెడ్డిపేట గౌడ సంఘం అధ్యక్షులు కళాని యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ అన్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేట్ రేణుకా మాత ఆలయంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 జయంతి వేడుకలను మండల గౌడ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు.

ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ... సర్వాయి పాపన్న గౌడ్ రాజ్యం కోసం పోరాటం చేయలేదని, ఔరంగాజేబుకు వ్యతిరేకంగా పీడిత బహుజనుల విముక్తి కోసం పోరాడిన మహాయోధుడు ఆయన అన్నారు. ఆయనను గౌడ జాతి ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి గౌడ జాతి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం తీర్మానం చేశారు. అంతకుముందు రేణుకా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలు పాల్గొనడానికి నాగిరెడ్డిపేట్ మండలం గౌడ కులస్తులు హైదరాబాద్కు తరలి వెళ్లారు.