విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల చర్చ
డిజిటల్ విద్యా సౌకర్యాలపై తల్లిదండ్రుల హర్షం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School) నేరేడుచర్ల నందు విద్యార్థుల అభ్యసనాసామర్ధ్యాలు, హాజరు,పాఠశాల అభివృద్ధి తదితర అంశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు(Parent Teachers) సమన్వయంతో పనిచేయాలని ప్రధానోపాధ్యాయులు బట్టు మధు కోరారు. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశానికి అధిక సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని, ఇంటి వద్ద పిల్లల చదువును ప్రవర్తనలను నిరంతరం పరిశీలించాలని కోరారు.
పాఠశాలలో డిజిటల్ బోధనా సౌకర్యాలు, కంప్యూటర్ విద్య, సైన్స్ ప్రయోగాల వినియోగం క్రీడలలో ప్రతిభ తల్లిదండ్రులకు వివరించారు పాఠశాలల్లో ఆధునిక విద్యా సౌకర్యాలు కల్పిస్తూ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రుల పాత్ర కీలకంగా మారిందని తగిన సమయం వెచ్చించి తల్లిదండ్రులు విద్యార్థుల విద్యాభివృద్ధికి తమతో పాటు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనా సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.