రోగి భద్రతకు పెద్దపీట

18-09-2026 | 05:15am

కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్, సెప్టెంబర 17 (విజయక్రాంతి): రోగి ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి చికిత్స పూర్తయి ఇంటికి వెళ్లి తదుపరి వైద్య పర్యవేక్షణ పొందే వరకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యం ఉండాలనే సందేశంతో కేర్ ఆసుపత్రులు (Care Hospitals), ఆస్టర్ ఆసుపత్రులు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం2026ను (World Patient Safety Day) నిర్వహించాయి. ఇందులో భాగంగా ఇండియా2 సమూహం పరిధిలోని ఆసుపత్రుల్లో ‘రోగి భద్రతఆరోగ్య అవగాహన కార్యక్రమం’ చేపట్టాయి.

సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రోగి భద్రతతో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, సక్రమమైన వ్యాధి నియంత్రణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్, సమూహం2 నాణ్యత, రోగి భద్రత విభాగాధిపతి రాజీవ్ చౌరే పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు