రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి తలసానికి లేదు

01-10-2026 | 05:25am

బీఆర్‌ఎస్ భజన మానేసి బీసీల కోసం మాట్లాడాలి

బీసీలకు న్యాయం చేసేది కాంగ్రెస్సే

పీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్  

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్‌(BRS leader Talasani Srinivas Yadav)పై పీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్(PCC Fisheries Chairman Mettu Saikumar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిరోజూ బీఆర్‌ఎస్, కేసీఆర్, కేటీ ఆర్ భజన చేసుకుంటూ రాజకీయ ఉనికిని కాపాడుకునే తలసాని శ్రీనివాసయా దవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శించే కనీస నైతిక అర్హత కూ డా లేదన్నారు.

బీసీల రాజకీయాన్ని కేసీఆర్ కుటుంబం వద్ద తాకట్టు పెట్టిన వ్యక్తి తలసాని శ్రీనివాస్‌రావేనని మెట్టు సాయికుమార్ తీవ్రం గా ఆరోపించారు. బీసీల హక్కులు, రాజకీయ వాటా, సామాజిక న్యాయం గురించి మాట్లాడే ముందు గతంలో బీసీల పట్ల తలసాని వ్యవహరించిన తీరును గుర్తు చేసుకోవాలని సూచించారు.కేసీఆర్ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై నోరు మెదపని తలసాని.. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాట్లాడటం విడ్డూరం గా ఉందని మెట్టు సాయికుమార్ అన్నారు.

బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు కాలం చెల్లిందని, బీసీలకు సామాజిక, రాజకీయ న్యాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను పొగడటమే రాజకీయమని భావిస్తున్న తలసాని ముందుగా బీఆర్‌ఎస్ పాలనలో బీసీలకు ఏం జరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని సాకుమార్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను చూసి బీఆర్‌ఎస్ నేతలు అసహనానికి గురవుతున్నారన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్ భజన రాజకీయాలు పక్కనపెట్టి బీసీల సమస్యలపై మాట్లాడాలని తలసానికి సూచించారు. 

మరిన్ని వార్తలు