నిత్య అవసరాలకు నీరు లేకుంటే ఎట్లా?
తండాను గ్రామపంచాయతీ చేస్తే సరిపోతుందా!
ఓట్లప్పుడు కాదు.. బాధలు పడ్డప్పుడు రండి
తాగునీరు ఇవ్వండి మహా ప్రభు అంటున్న పట్టించుకోవట్లే
అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడుపుతున్రు
సర్పంచి దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తాం : స్రవంతి, పంచాయతీ కార్యదర్శి
బాలానగర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): నిత్య అవసరాల సరుకులు అడగట్లే.. ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇవ్వాలని కోరట్లే.. క్రమం తప్పకుండా తాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ వేడుకుంటున్న మా వైపే చూడకుంటే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ వాయిల్ కుంట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు కన్నీరు పెట్టుకుంటుండ్రు.
మా తాండకు రావాలని అడగకముందే ఓట్లు వేసే సమయం దగ్గర పడితే నేతలు ఒకరి తర్వాత మరొకరు వరుస కడతారు.. డప్పులతో రంగురంగుల జెండాలతో మా తాండాను రంగుల మాయం చేస్తారు... ఇప్పుడే ఇంత రంగోలి లా ఉత్సాహభరితంగా నేతలు నిరుస్తా పడకుండా ఉండేలా చేయడంలో ఎంతో ఆత్రుత కనబరుస్తారు.
ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ ఎన్నికలు పూర్తి అయిందంటే చాలు ఇక మాకు వారితో పని ఏముంది లే అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మాకు తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వండి అంటూ తండాలో బిందెలు పట్టుకొని మా సమస్యను పరిష్కరించండి అంటూ వేడుకుంటున్న సంఘటన గ్రామస్తుల్లోని పలువురిని కంటతడి పెట్టిస్తుంది.
తాగునీరు ఇవ్వండి అంటూ అడుగుతున్న చుట్టుపక్కల ఉన్న బోర్ల దగ్గర తెచ్చుకోండి అన్నట్టు ఎవరు పట్టించుకోవడంలేదని తాండావాసులు చెబుతున్న ఆవేదన. స్పందించాల్సిన అధికార యంత్రాంగం అటువైపు చూడడమే మానేశారని, ఇకనైనా మా సమస్యకు పరిష్కార రూపం దాల్చాలంటూ వాయిల్ కుంట గ్రామ తండావాసులు కోరుకుంటుండ్రు.
వర్షాకాలంలోనే ఇదేం గోస?
ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు చిన్నపాటి కష్టం కలిగిన మేమున్నామంటూ చెబుతున్న నేతలు గత వారం పది రోజుల నుంచి తాగునీటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని తాండవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెంటనే తమ తండాను పరిశీలించాలని, తాగునీరు లేకపోవడంతో తమ ఆవేదనను పరిగణలోకి తీసుకొని సంబంధిత అధికార యంత్రాంగానికీ పూర్తిస్థాయిలో ఆదేశాలు జారీ చేసి తమకు క్రమం తప్పకుండా తాగునీరు ఇచ్చేలా చూడాలని వారు వేడుకుంటున్నారు.
మౌలిక సదుపాయాలు అడగట్లే
వాయిల్ కుంట తండా వాసులు తమకు ఎలాంటి మౌలిక సదుపాయాలను అడగట్లేదని కనీసం తాగునీరు కూడా లేకుంటే తండాలో ఎలా నివసించాలని ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉందో పూర్తి స్థాయిలో పరిశీలన చేసి పరిష్కరిస్తే తమకు నీటి సమస్య రాదని తాండవాసులు చెబుతున్నారు. తమ నీటి సమస్యను పరిష్కరించడం ఆందోళన బాట పట్టక తప్పడం లేదని, ఇకనుంచి అయిన తమకు పరిష్కార రూపం దాల్చాలంటూ వారు చెబుతున్న మాట. అధికారులు ఈ సమస్యను పరిష్కరిస్తారా వర్షకాలంలో కూడా తాగునీటి సమస్యను మరింత తీవ్ర రూపం దాల్చిన చేస్తారా? చూడాలి.
సర్పంచ్ కి చెప్పి పరిష్కరిస్తాం
నీటి సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంటూ పంచాయతీ కార్యదర్శి స్రవంతి తాండవాసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందని తాండవాసులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై విజయ్ కాంతి సర్పంచ్ తో పాటు పంచాయతీ కార్యదర్శి ఫోన్ ద్వారా సమాచారం అడిగిందేకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.






