కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ @ ఇసుక
- 7 టిప్పర్లను ఆపి పట్టించిన బీఆర్‌ఎస్ నేతలు
- అవినీతికి ఆద్యం పోసిందే బీఆర్‌ఎస్ అంటున్న కాంగ్రెస్
- దేవరకద్ర నియోజకవర్గమంతా అక్రమ ఇసుక చర్చ
- అనుమతి లేనిదే ఇసుక తరలించకూడదని ఎమ్మెల్యే ఆదేశం
చిన్న చింతకుంట,సెప్టెంబర్ 22 : అక్రమ ఇసుక రవాణా(Illegal sand transport) అధికార పార్టీకి తలనొప్పిగా మారుస్తుంది. అర్ధరాత్రి దేవరక ద్ర నియోజకవర్గంలో బంట్రవల్లి దగ్గర 7 టిప్పర్లు ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించి బిఆర్‌ఎస్ నేతలు కొందరు వారిని ఆపి పోలీసులకు అప్పగించిన సంఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీ అయితే ఇష్టానుసారంగా ఇసుక తరలించాలా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు ఫైర్ అ వుతున్నారు.
గత బిఆర్‌ఎస్ పరిపాలనలో వారు చేసిన అవినీ తి అక్రమాల వల్లే అధికారం కోల్పోయారని ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుక తరలింపు చేస్తున్నమంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ చర్చ నియోజకవర్గమంతా అక్రమంగా ఇసుక అర్ధరాత్రి దర్జాగా చేస్తున్నారని, బీఆర్‌ఎస్ నేతల పనులు జరగనందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు ప్ర త్యేకంగా చర్చించుకుంటుండ్రు.
నిఘా పెంచడంలో నిండా నిర్లక్ష్యం..
అక్రమ ఇసుక ఆపేందుకు మైనింగ్ శాఖ(Department of Mines)తో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖలు ఉన్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితం లేదని ప్రజలు చెబుతున్నారు. నిఘా పెంచడంలో సంబంధిత అధికార యంత్రాంగం నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అంటూ ప్రజలు ప్రశ్నిస్తుండ్రు. బీఆర్‌ఎస్ నేతలు నేరుగా అక్రమంగా తరలిస్తున్న వాహనాల కు అడ్డుగా వెళ్లి అనుమతి లేదని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేయించడంతో నియోజకవర్గ మంతా ఈ చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రతిపక్ష పార్టీ లో ఉన్నప్పటికీ కూడా ఇలా కూడా చేయొచ్చా అనే రీతిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
బీఆర్‌ఎస్ నేతల పర్యవేక్షణ ఒక్కరోజేనా.. ప్రతి రోజా?
నిబంధనలకు లోబడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి(Indiramma house construction) అధికారుల సూచన మేరకు ఇసుక తరలించాలి. అక్రమంగా తరలిస్తే ఊరుకునేది లేదని అధికారులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి(Madhusudan Reddy) ఆదేశించినట్లు కాంగ్రెస్ నేతలు గట్టిగా చెప్తున్నారు. ఇక మీదట కూడా బీఆర్‌ఎస్ నేతల పర్యవేక్షణ ఇలాగనే కొనసాగుతుందా లేక ఇది ఒక్క రోజుకే ముగుస్తుందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది.
అదే జరిగితే నియోజకవర్గం అంతా వాగుల్లో ఇసుక అనుమతి ఉంటేనే బయటికి వెళ్లే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. అధికార పార్టీ మాత్రం అక్రమ ఇసుకకు తమకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఇంతకు ముగుస్తుందా మరింత ముందుకు సాగుతుందా వేచి చూడాలి.