మదర్ డెయిరీలో ఎన్నికల సందడి

23-09-2026 | 05:05am
  1. పాలకవర్గంలో 3 స్థానాలకు 12 నామినేషన్లు 
  2. ఎన్నికల అధికారి కె.నరేందర్ రెడ్డి 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 22 : నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల(Nalgonda-Ranga Reddy Milk Producers) పరస్పర సహా యక సహకార సమితి లిమిటెడ్, నార్ముక్ మదర్ డెయిరీ పాలకవర్గం(Narmuk Mother Dairy Board of Directors)లో ఈ నెల 30తో పదవీ కాలం ముగిసిన 3 స్థానాలకు 12 నామినేషన్లు(Nominations) స్వీకరిస్తున్నట్లు ఎన్నికల అధికారి కె.నరేందర్ రెడ్డి(Narender Reddy) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి(Election Officer) మాట్లాడుతూ.. మదర్ డెయిరీ నార్మాక్ పాలకవర్గంలో ఖాళీలు ఏర్పడిన జనరల్ మహిళా, 2 జనరల్ స్థానాలకు  ఈ నెల 18 నుంచి 21 వరకు అర్హులైన అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరించామని తెలిపారు.

ఆయా నామినేషన్ల పత్రాలను పరిశీలించిన అనంతరం మహిళా జనరల్ స్థానానికి నలుగురు మహిళలు పోటీ పడుతున్నారని తెలిపారు. వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District), మోత్కూరు మండలం, దాచారం గ్రామానికి చెందిన అండెం మంజుల, యాదగిరిగుట్ట మం డలం, మహబూబ్పేట గ్రామానికి చెందిన కందాల అలి వేలు, రాజాపేట మండలం, పొరుపల్లి గ్రామానికి చెందిన చీర లావణ్య, బొమ్మల రామారం మండలం, మర్యాల గ్రామానికి చెందిన పి.పావణి నామినేషన్లు పరిశీలన పూర్తిచేసి ఫైనల్ జాబితాను ప్రకటించామన్నారు.

మిగతా రెండు జనరల్ స్థానాలకు నామినేషన్లు పత్రాలను పరిశీలించిన అనంతరం నల్లగొండ జిల్లా, పెద్ద సూరారం గ్రామానికి చెందిన కోట్ల జలేందర్రెడ్డి, సూ ర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, అన్నారం గ్రామానికి చెందిన కుంచాల ప్రవీణ్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, మైలారిగూడెం గ్రామానికి చెందిన యం. కొండల్ రెడ్డి, వలిగొండ మండలం, గొల్నెపల్లి గ్రామానికి చెందిన గూడూరు శ్రీధర్ రెడ్డి, యాదగిరిగుట్ట మండలం, బహుపేట గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, రామన్నపేట మండలం, కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన బెల్లి లింగస్వామి, ఆలేరు మండలం, రాఘవపురం గ్రామానికి చెందిన శీలం వెంకట్ నర్సింహారెడ్డి, ఆలేరు మండలం, బైరాంనగర్ గ్రామానికి చెందిన డి. సోమిరెడ్డి నామినేషన్లు పరిశీలన పూర్తిచేసి ఫైనల్ జాబితాను ప్రకటించామని తెలిపారు.

ఈనెల 23న నామినేషన్లు ఉపసంహరణ, అదేరోజు చెల్లుబాటు అయ్యే నామినే షన్లు జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల చిహ్నామును కేటాయిస్తామని తెలిపారు. ఈనెల 28న హయత్ నగర్ లోని ఆర్టీసీ కాలనీ, ఎస్వీ కన్వెన్షన్ లో ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడుతాయని వెల్లడించారు.

మరిన్ని వార్తలు