విమానం కూల్చేకుట్ర భగ్నం

01-10-2026 | 05:10am
  1. ఫ్లైట్ లో పైలెట్ల మధ్య బిగ్‌ఫైట్
  2. 33వేల అడుగుల ఎత్తులో పైలెట్‌పై కోపైలెట్ కత్తితో దాడి
  3. ‘ఫ్లుదుబాయ్’లో రక్తపుధారలు.. ప్రయాణికుల భయభ్రాంతులు
  4. నిమిషంలోనే 17వేల అడుగుల దిగువకు కుదుపు
  5. ప్రతిఘటించి, విమానాన్ని రక్షించిన భారత సంతతి పైలెట్
  6. అప్రమత్తమైన ఇజ్రాయెల్.. యుద్ధ విమానాలతో రక్షణ
  7. సురక్షితంగా సౌదీలోని తబూక్‌లో ల్యాండింగ్
  8. ప్రాణాలతో బయటపడ్డ180 మంది ప్రయాణికులు

రియాద్, సెప్టెంబర్ 30: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(United Arab Emirates) నుంచి ఇజ్రాయెల్‌(Israel)కు ఒక వాణిజ్య విమానం బుధవారం 33 వేల అడుగుల ఎత్తులో వెళ్తోంది. హఠాత్తుగా ఫ్లైట్ లో పైలెట్‌పై కోపైలెట్ కత్తితో దాడిగి దిగాడు. అడ్డుకున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో ఫ్లుదుబాయ్‌లో రక్తపుధారలు బెంబేలెత్తించాయి. ప్రయాణికుల తీవ్ర భయభ్రాంతులు గురాయ్యరు. కో విమానాన్ని ఒక్కసారిగా భూమిని ఢీకొట్టేందుకు యత్నించాడు.

నిమిషం వ్యవధిలోనే 17వేల అడుగుల దిగువకు ఫ్లుటై దూసుకురావడంతో అందరూ హాహాకారాలు చేస్తూ.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తల్లిడిల్లిపోయారు. మెరుపు వేగంతో భారత సంతతి పైలట్  స్మిత్ మచ్ఛర్ ప్రతిఘటించి, విమానాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. 180 మంది ప్రయాణికులు గల విమానాన్ని కూల్చేకుట్రను భగ్నం చేశాడు. దాదాపు గంట సేపు నింగిలో ఫ్లుటైను చక్కర్లు కొట్టిస్తూ.. కోపైలట్‌తో పోరాడుతూ.. అదుపు చేశాడు. ఈ లోగా ఎమర్జెన్సీ కోడ్ అందడంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్.. యుద్ధ విమానాల ను రంగంలోకి దింపింది.

ప్రయాణికులతో సహా విమానం సురక్షితంగా సౌదీలోని తబూక్‌లో అత్యవసర ల్యాండింగ్ అవ్వడంతో తీవ్ర ఉత్కంఠకు తెరపడి, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్ఛర్ సమయస్ఫూర్తిని, ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును అందరూ కొనియాడుతూ..అతన్ని హోరోగా కీర్తిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ‘ఫ్లు దుబాయ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ మాక్స్8’ విమానం 180 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

సౌదీ అరేబియా గగనతలంలో ఉండగా విమానంలో ఒక కో్ర మరో పైలెట్‌పై కత్తితో దాడి చేసి, విమానాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవ డానికి ప్రయత్నించాడు. గట్టిగా కేకలు వినిపించడంతో కొందరు ప్రయాణికులు వెళ్లి కాక్‌పీట్ డోర్ తెరవగానే పైలెట్ రక్తం మడుగులో కనిపించాడు. ఘర్షణను ఆపే క్రమంలో పలువురి ప్రయాణికులకూ గాయాలయ్యాయి. రక్తం ధారలా ప్రవహించింది. ఓ వైపు కో పెనుగులాట జరుగుతుండగా విమానం హఠాత్తుగా ఆ విమానం సుమారు ఒక నిమిషం వ్యవధిలో 33,000 అడుగుల నుంచి 17,000 అడుగులకు (దాదాపు 10,000 మీటర్ల నుంచి 5,100 మీటర్లకు) అకస్మాత్తుగా కిందికి దిగివచ్చింది. ఈలోగా భారత సంతతికి చెందిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఫ్లుటైను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

కోపైలట్‌ను ప్రయాణికులు బంధించారు. దుబాయ్ నుంచి బయలుదేరిన సుమారు రెండున్నర గంటల తర్వాత విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్ అందడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది.

జోర్డాన్ సరిహద్దుకు సమీపంలో ప్రమాదానికి గురైన విమానం అస్తవ్యస్తంగా చక్కర్లు కొట్టింది. చివరకు సుమారు గంట తర్వాత తబూక్‌లో ల్యాండ్ అయింది. విమానం కిందకు సురక్షితంగా దిగగానే ప్రయాణికులంతా చప్పట్లు కొడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ఉగ్రదాడిగా భావిస్తూ ఉన్నతస్థాయి దర్యాప్తును ప్రారంభించింది. ఘటన జరిగిన గంటల్లోనే ఇజ్రాయెల్ నిఘా వర్గాలైన షిన్ బెట్, మొస్సాద్, ఇజ్రాయెల్ సైన్యం, రవాణా మంత్రిత్వ శాఖలు దర్యాప్తునకు మెరుపు వేగంతో రంగంలోకి దిగాయి. 

రక్షించిన భారత పైలెట్ 

విమానాన్ని కాపాడిన పైలట్ భారతదేశానికి చెందిన ఫ్లైదుబాయ్ కెప్టెన్‌ను భారత జాతీయుడైన స్మిత్ మచ్ఛర్‌గా అని ఇజ్రాయిల్‌కు చెందిన పలు మీడియా సంస్థలు, దుబాయ్ ప్రభుత్వం గుర్తించాయి. కో-పైలట్ దాడి చేసినా కెప్టెన్ ప్రతిఘటించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో భారత కెప్టెన్ విమానాన్ని రక్షించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఘటనలో వీరోచితం గా పోరాడి ఏకంగా 180 మంది ప్రయాణికులను రక్షించారు. దీంతో భారత పైలట్ ఇప్పుడు హీరోగా మారారు.

పైలట్లలో ఒకరు మరొక రిని కత్తితో పొడిచి, ప్రయాణికులతో ఉన్న విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు. గుజరాతీ మూలాలు ఉన్న మచ్ఛర్, జూన్ 2022లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్- ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. అంతకు ముందు, ఆయన జూన్ 2011 నుంచి 2022 వరకు స్పైస్ జెట్‌లో దాదాపు 11 సంవత్సరాలు పనిచేశారు. మచ్ఛర్ వెలింకార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు.

మరిన్ని వార్తలు