కేంద్ర మంత్రులతో మోదీ అర్ధరాత్రి భేటీ..ఎందుకంటే..?
08-09-2026 | 12:57pm
కేంద్ర కేబినెట్ ప్రక్షాళన((Union Cabinet Reshuffle) )పై ప్రధాని మోదీ(PM Modi) కసరత్తు కొనసాగుతున్న వేళ, కేంద్ర సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులతో అర్ధరాత్రి కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన భేటీలో శాఖల పనితీరు, ‘వికసిత్ భారత్ 2047’ ప్రణాళికలు, రాబోయే ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం చేసిన పనిని నిరూపించుకోవాలని మంత్రులకు సూచించిన మోదీ, సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు, సోషల్ మీడియా స్పందనపై కూడా సమీక్ష నిర్వహించారు.