చట్టసభల్లో ఆదివాసీ ఎరుకలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి
- ప్రత్యేక ఐటీడీఏ, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
- ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు
ముషీరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): చట్టసభల్లో ఆదివాసి ఎరుకల సామాజిక వర్గానికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం(Telangana Adivasi Erukala Association) రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు(Raju), ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బషీ ర్బాగ్లో నిర్వహించిన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక ఐటీడీఏ, ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఎరుకల విద్యార్థులకు(Students) ప్రత్యేక సీట్లు కేటాయించాలని, ని రుపేద కుటుంబాలకు ట్రైకార్ ద్వారా రూ.12 లక్షల రుణ సౌకర్యం కల్పించాలని, జీవో నం.56లోని ఎంపవర్మెంట్ స్కీమ్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురంలోని ఎరుకల నాంచారమ్మ పంచకూటాలయ దేవాలయాన్ని పునర్నిర్మించాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసి, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు రెండు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంసారం నాగులు, కోనేటి నరసింహ, కోనేటి రాజు, పాతపల్లి నరసింహ, దుగ్యాల బాపు, దేవరాయ యాదగిరి, మాదిగని ఎల్లయ్య, మొగులయ్య సాయిరాం, ఉండ్రాతి రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం మహిళా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా కేంసారం సరళ, ప్రధాన కార్యదర్శిగా రాణమ్మ, ఉపాధ్యక్షురాలిగా ఇందిర ఎన్నికయ్యారు.