రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

05-10-2026 | 08:04pm

విద్యుత్ ఎఈ కే విజయ్ కుమార్

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 5 (విజయక్రాంతి): విద్యుత్ మరమ్మత్తుల కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని గుండ్లపోచంపల్లి విద్యుత్ ఎఈ కే విజయ్ కుమార్(Electricity AE Vijay Kumar) పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11కెవి నైబర్ హుడ్ ఫీడర్,11కెవి లక్ష్మీనగర్ ఫీడర్,11 కెవి ధూలపల్లి ఫీడర్,11 కెవి జిపి పల్లి ఫీడర్, 11 కెవి అపర్ణ ఫీడర్, 11 కెవి ఏపీఐఐసీ ఫీడర్,గుండ్లపోచంపల్లి 33/11 కెవి సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ ల కింద వేపుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించుటకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు 1) ట్రైడెంట్ ప్రాపర్టీస్,ఊర్జితా విలాస్1,నైబర్ హుడ్ విలాస్,ఎజి సైట్ కాలనీ,శ్రీ క్రిష్ణ అపార్ట్మెంట్,ఎస్సీ కాలనీ,2)లక్ష్మీనగర్,మాణిక్ రెడ్డి నగర్,ఉర్జితా 2,3,సంజనాస్ అపార్ట్మెంట్స్,ప్రైమస్ ఎప్సిలోన్ తో పాటు ప్రెస్టేజ్ గ్రీన్,3)ధూలపల్లి రోడ్,డిరీస్ స్కూల్,మురళి కృష్ణా ఎస్టేట్,4)బీరప్ప గడ్డ,గోల్డెన్ లీఫ్,అయోధ్య చౌరస్తా,స్టెర్లింగ్ హోమ్స్,ఖాజాగూడ,మురళి కృష్ణా వెంచర్,వెంకట్ రాజు గోడౌన్స్,5)అపర్ణ కెనోపి,తులిప్,జాస్మిన్ అపార్ట్ మెంట్,6) అప్పెరల్ పార్క్,ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎఈ కే విజయ్ కుమార్ వెల్లడించారు. రేపు విద్యుత్ అంతరాయానికి వాణిజ్ఞ వ్యాపార సంస్థల యజమానులు,పొలిటికల్ పార్టీ నాయకులు అధికారులు ప్రజలు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు