సింగరేణిలో ఘనంగా ప్రజాకవి కాళోజీ 112వ జయంతి వేడుకలు

09-09-2026 | 07:15pm

ఇల్లెందు, (విజయక్రాంతి): ప్రజల గొంతుకగా, సామాన్యుడి పక్షాన కలం పట్టిన మహాకవి కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) భావజాలం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య( Illandu Area General Manager V. Krishnaiah) అన్నారు. సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం కాళోజీ 112వ జయంతి వేడుకలను(Kaloji birthday celebrations) ఘనంగా నిర్వహించారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. బహుభాషావేత్తగా, ఉద్యమకారుడిగా, ప్రజాకవిగా కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. “హింస తప్పు.. రాజ్యహింస మరీ తప్పు”, “సామాన్యుడే నా దేవుడు” అంటూ ప్రజల పక్షాన నిలిచిన కాళోజీ తెలంగాణ సమాజానికి మార్గదర్శకుడని కొనియాడారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారాం, డీజీఎం (ఐఈడీ) ప్రభాకర్, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు