పూర్వ ప్రాథమిక పాఠశాలలతో చిన్నపిల్లల్లో విద్యపై ఆసక్తి

21-09-2026 | 07:07pm

బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వ ప్రాథమిక పాఠశాలల వల్ల చిన్న పిల్లల్లో విద్యపై ఆసక్తి పెరగడంతో పాటు పట్టు సాధిస్తారని మండల విద్యాధికారి మహమ్మద్ హుస్సేన్(Mandal Education Officer Mohammed Hussain) పేర్కొన్నారు. సోమవారం మండలంలోని మరల పల్లి గ్రామంలో మంజూరు అయిన పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆటపాటలతో కూడిన విద్య బోధన వల్ల పిల్లలు శారీరక మానసిక ఎదుగుదల వేగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ షీలా భాయి ఉపసర్పంచ్ రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమరేందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు