బీఆర్‌ఎస్‌లో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీల చిచ్చు

18-09-2026 | 05:15am
  1. బీఆర్‌ఎస్ నాయకుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు 
  2. ప్రీతిరెడ్డి వ్యూహం ఏమిటో? 

మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): జిల్లా బిఆర్‌ఎస్ పార్టీలో ప్రీతి రెడ్డి ఫ్లెక్సీల చిచ్చు రేపింది. మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మె ల్యే మల్లారెడ్డి (Former Minister, Medchal M.L.A. Mallareddy) కోడలు ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా సుచిత్ర, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వారి విద్యాసంస్థలలో పని చేసేవారు శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఇందులో మల్లారెడ్డి కుటుంబీకుల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. మధ్యలో ప్రీ తిరెడ్డి ఫోటోలు, చుట్టుపక్కల వారి కుటుంబీకులు మల్లారెడ్డి తో పాటు మల్కాజ్గిరి ఎ మ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, చామకూర మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి ఫోటోలు ఉన్నా యి.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతం కుతుబుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుం ది. దీంతో స్థానిక బి ఆర్ ఎస్ కార్యకర్తలు కెసిఆర్, కేటీఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ సుంకరి రాజు ఫోటో లు లేవని ఫ్లెక్సీలు చించి వేశారు. మల్లారెడ్డి బీ ఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని, పార్టీ నేతల ఫోటోలు లేకుండా ఎలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కార్యకర్తల ప్రశ్నిస్తున్నారు.

ఫ్లెక్సీలు వ్యక్తిగతం కాదని, ఒక రాజకీయ పార్టీలో ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు. మల్లారెడ్డి కొంతకాలంగా బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల హరీష్ రావుతో జరిగిన చర్చల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ స మయంలో ఫ్లెక్సీల చిచ్చు రేపింది. మల్లారెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! 

ప్రీతిరెడ్డి వ్యూహమేమిటి? 

జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక ప్రీతి రెడ్డి వ్యూహం ఏదో ఉండవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా ఆమె రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు జరిగిందని పలువురు అభిప్రాయపడుతు న్నా రు. ఆమెకు బి ఆర్ ఎస్ లో కొనసాగడం ఇ ష్టం లేదని, అందుకే ఆ పార్టీ నాయకుల ఫో టోలు పెట్టలేదని అంటున్నారు. ప్రీతి రెడ్డి బిజెపి వైపు ముగ్గుచూపుతున్నారని అంటున్నారు. గతంలో మల్లారెడ్డి ఒక సందర్భంలో తన అనుచరులకు కూడా ఈ విషయం చెప్పారు.

చిన్న కొడుకు భద్రారెడ్డి, కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి బిజెపిలో చేరవచ్చు అన్నారు. దీనిని బట్టి ప్రీతి రెడ్డి రాజకీయాల్లోకి వస్తే బిజెపిలో చేరుతారని స్పష్టమవు తోంది. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే సోషల్ మీడియాలో, లైవ్ కార్యక్రమా ల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీలో జరి గిన సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో అం తా తానై వ్యవహరించారు. అంతేగాక బెంగళూరులో జరిగిన సైమా కార్యక్రమంలో మెరిశారు. 

ఘాటుగా స్పందించిన ప్రీతిరెడ్డి 

ఫ్లెక్సీలో చించివేతపై ప్రీతి రెడ్డి ఘాటుగానే స్పందించారు.’కొంతమంది ఫ్లెక్సీలు చించి వేశా రు... చించనీయండి... నా మనోబలాన్ని మాత్రం చించలేరు’అని అన్నారు. హాస్పిటల్, కాలేజీ స్టాప్ అభిమానంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, రాజకీయ కార్యక్రమమైతే అందరి ఫోటోలు పెట్టేవారిని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు