ప్రాథమిక పాఠశాలలను పకడ్బందిగా పర్యవేక్షించాలి
డి.డి.జి అశోక్ గౌడ్..
ఉట్నూర్, సెప్టెంబర్ 21( విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) ప్రాథమిక పాఠశాలలను పకడ్బందిగా పర్యవేక్షించే బాద్యత ఎస్.సి.ఆర్.పి. లదేనని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టరు జి. అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం ఉట్నూర్ పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ఎస్.సి.ఆర్.పి. ల సమీక్షా సమావేశంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమమపాలన పాటించేలా చూడాలన్నారు. పాఠశాలలో చక్కటి విద్యాబుద్ధులు పిల్లలకు నేర్పించేలా చూడాలన్నారు.
విద్యార్థుల హాజరుపై దృష్టి సారించాలని, బడిఈడు పిల్లలందరిని బడిలో ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి ఎస్.ఇ.ఆర్.పి.లు ప్రతి రోజు తమ పరిధిలో గల రెండు పాఠశాలలను సందర్శించాలన్నారు. తల్లిదండ్రులు, గ్రామ పెద్దలను పాఠశాల అభివృద్ధిలో, విద్యార్థుల హాజరు శాతం పెంచడంలో భాగస్వాములను చేయలని కోరారు. ఆట, పాటలతో గుణత్మక విద్య బోధన జరిగేలా చూడలని చెప్పారు. అనంతరం హెచ్ డబ్లుఓల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మెను అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై మార్గధర్శనం చేసారు.