బెలలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
17-09-2026 | 05:13pm
బెల సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జన్మదినాన్ని పురస్కరించుకుని బెల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు మోదీ దేశ అభివృద్ధికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.