సైకో డీఎస్పీ ప్రేమ్‌రాజ్!

18-09-2026 | 05:25am

తమిళ స్టార్ హీరో సూర్య (Tamil star hero Suriya), మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో (Malayalam director Jithu Madhavan) కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. యాక్షన్ -కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా.. ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘సీన్’ అనే పేరుతో ఈ సినిమాను మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

జాగా గురువారం మేకర్స్ ఈ మూవీ తెలుగు టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించారు. తాజా టైటిల్ గ్లింప్స్‌లో సూర్యను ఓ విచిత్రమైన పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. ‘డీఎస్పీ ప్రేమ్‌రాజ్’గా  సూర్య ఎంట్రీ అదిరిపోయింది. ఈ చిత్రానికి డీవోపీ:  వినీత్ అగస్టిన్; సంగీతం: సుశిన్ శ్యామ్; ఎడిటింగ్: అజ్మల్ సాబు. 

మరిన్ని వార్తలు