ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేశవరావు
మేడ్చల్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ (Telangana Public Administration Day) వేడుకలు అట్టహాసంగా జరిగాయి.ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు విచ్చేసి జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహం (Telangana Thalli Statue) వద్ద నివాళ్లు అర్పించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడు తూ ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతోమంది మహానీయుల అసమాన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అ ని, ఆ పోరాట పటిమను స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలో మన జిల్లాను అభివృద్ధి పథంలో మొదటిస్థానంలో ఉండేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ పథకాలను పేదలకు అందించడంతోపాటు జిల్లా ను అన్నిరంగాలలో అభివృద్ధి పరచడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని అన్నారు.
జిల్లా అభివృద్ధిలో చెందడం అంటే కలెక్టర్, జిల్లా అధికారులు యంత్రాం గం ఎంతో కృషి చేయడమేనన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడం, అంగ న్ వాడీల నిర్వహాణ,రేషన్ కార్డుల పంపిణీ, అభయహస్తం పథకాలు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరా మహిళా శక్తి, ఆరోగ్య కేంద్రాలు, రై తు భరోసా, మహిళ, చిన్నారుల భద్రత కో సం టీ సేఫ్ యాప్ వంటి ఎన్నో పథకాలను ప్రజలకు ఉపయోగపడేలా పథకాలను ప్రభుత్వం రూపొందించి అమలు పరుస్తుందన్నారు.
తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాటయోధులైన మహానీయుల స్పూర్తి తో రెట్టింపు ఉత్సాహాముతో అందరం కలిసికట్టుగా శ్రమించి సంక్షేమం మరియు సమ తుల్య అభివృద్ధి కలను సాకారం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, ఉప్పల్ డిసిపి సురేష్ కుమార్, అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ కమిటి ఛైర్మన్ నర్సింహులుయాదవ్, గ్రాంధాలయ కమిటి ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టిఎ కమిటి సభ్యులు జైపాల్ రెడ్డి, డిఆర్‌ఓ మాలతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ లో.....
మేడ్చల్లో బిజెపి పట్టణ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్య క్షుడు పాతూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అ ధ్యక్షుడు రాగం అర్జున్, సీనియర్ నాయకు లు పార్టీ సుధాకర్ రెడ్డి, చెరుకొమ్మ శ్రీనివాస్ గౌడ్, మోహన్ రావు, సత్యనారా యణ,కానుకంటి వంశీ విజయ్, వంశీధర్ రెడ్డి, మైసరి రాజు, గోపు నాగరాజు, జంగం అనిత తదితరులు పాల్గొన్నారు.
గుండ్ల పోచంపల్లి లో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర మోహన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కావేరి శ్రీధర్ ముదిరాజ్, రామారావు, నవీన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.