పూసపల్లి ఓసీని సకాలంలో ప్రారంభించాలి

30-09-2026 | 03:10pm

ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సింగరేణి ఇల్లెందు ఏరియాలో నూతనంగా ప్రారంభం కానున్న పూసపల్లి ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టును(Pusalapalli Open Cast Project) ఎఐటీయూసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ బుధవారం పరిశీలించారు. జేకేఓసీపీ రక్షణ అధికారి ఏజీ శివప్రసాద్‌ ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను వారికి వివరించారు. అనంతరం అభివృద్ధి పనులు, సబ్‌స్టేషన్‌ ప్రాంతం, క్రషర్ల నిర్మాణం, ఓబీ ప్రారంభించే ప్రాంతంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు.

పూసపల్లి ఓసీ కోసం నిర్వాసితులైన గ్రామస్తులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో పాటు ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పూసపల్లి నూతన ఓసీ ఇల్లెందు ఏరియా ప్రజలకు ఆశాకిరణమని, ప్రాజెక్టును సకాలంలో ప్రారంభిస్తే ఏరియా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే గుర్తింపు సంఘం ధ్యేయమని తెలిపారు.

కార్యక్రమంలో బ్రాంచ్‌ కార్యదర్శి ఎండీ నజీర్‌ అహ్మద్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కొరిమి సుందర్‌, సీపీఐ మండల కార్యదర్శి బొప్పిశెట్టి సత్యనారాయణ, టీజేఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్‌ కృష్ణ, ఫిట్‌ కార్యదర్శులు వి.జయరాజ్‌, దాట్ల వెంకటేశ్వర్లు, తిలక్‌నగర్‌ ఉపసర్పంచ్‌ షేక్‌ ఖాసీం, బాషపాక రవి, ఇబ్రహీం, సైదారెడ్డి, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు