‘రాజాధిరాజ్ యాత్ర కృష్ణలీల ఆప్కే ద్వార్’
అక్టోబర్ 2 నుంచి 4 వరకు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ప్రదర్శన
హైదరాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ధన్రానాజ్ నత్వానీ రూపొందించి న ‘రాజాధిరాజ్ యాత్ర లీల ఆప్కే ద్వార్’ (Rajadhiraj Yatra Leela Aapke Dwar) హైదరాబాద్ ఎడిషన్‌ను(Hyderabad Edition) గురువారం హైదరాబాద్‌లోని హోటల్ ప్లాజా, బేగంపేటలో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆ విష్కరించారు. శ్రీకృష్ణుడి శాశ్వత కథలు, లీలలను సంగీతం, నృత్యం, నాటకం, విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ఆవిష్కరించే ఈ భారీ థియేట్రికల్ ప్రొడక్షన్‌ను హైదరాబాద్‌లో అక్టోబర్ 2 నుంచి 4 వరకు హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ప్రదర్శించనున్నారు.
మూ డు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు 10 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. రాగ్ రంగ్ రాస్ వ్య వస్థాపకులు రితు షా, రోమిత్ షా ఆధ్వర్యం లో హైదరాబాద్ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నా రు. హైదరాబాద్‌లో భారీ స్థాయి సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాలను అందించాలనే తమ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అ డుగు అని వారు తెలిపారు.
రాగ్ రంగ్ రాస్ వ్యవస్థాపకురాలు రితు షా మాట్లాడుతూ రాజాధిరాజ్ అనేది సంగీతం, నృత్యం, నాట కం, విజువల్ స్టోరీటెల్లింగ్ ద్వారా శ్రీకృష్ణుడి శాశ్వత కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రత్యేకమైన థియేట్రికల్ అనుభవం. కళ, సంస్కృతి, సంప్రదాయాలను ఆదరించే హైదరాబాద్ నగరానికి ఈ అద్భుతమైన ప్రదర్శనను తీసుకురావాలని మేము కోరుకున్నాం.
వివిధ తరాల ప్రేక్షకులు ఇందులోని కథలు, భావోద్వేగాలతో అనుసంధానం అ వుతారని ఆశిస్తున్నాం అని అన్నారు.రాగ్ రంగ్ రాస్ వ్యవస్థాపకుడు రోమిత్ షా మా ట్లాడుతూ, హైదరాబాద్‌లో రాజాధిరాజ్ ప్రదర్శన ఇదే తొలిసారి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ప్రొడక్షన్‌కు మంచి స్పందన లభించిం ది. హైదరాబాద్‌కు ఈ ప్రదర్శనను తీసుకురావడం ద్వారా నగర ప్రేక్షకులకు ఒక ప్రత్యే కమైన సాంస్కృతిక అనుభవాన్ని అందించాలనుకుంటున్నాం.
భారీ స్థాయి ప్రదర్శన, సంగీతం, కళాకారుల ప్రదర్శన, కథనంతో శ్రీకృష్ణుడి శాశ్వత ప్రయాణాన్ని ప్రేక్షకులు మరో ప్రత్యేకమైన కోణంలో అనుభవించవచ్చు అని అన్నారు. కర్టెన్ రైజర్,పోస్టర్ ఆవి ష్కరణ కార్యక్రమానికి అమిత్ షా, మాన్సీ షా, వేదికా షా, దేవాన్ష్ షా, హేషా షా, ఆర్యమాన్ షా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగే ప్రదర్శన కు సంబంధించిన టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉన్నాయి. ‘రాజాధిరాజ్ యాత్ర లీల ఆప్కే ద్వార్’ ప్రదర్శనకు ఎంఈఐఎల్ ప్రెజెంటర్‌గా, భృండ, ఎంపీఎల్, కమల్ వాచ్ కో. పవర్డ్ బైగా వ్యవహరిస్తుండగా, హాలీడే బజార్ ట్రావెల్ పార్టనర్‌గా ఉంది.